మహాభారతం ప్రస్థానం పూర్తి తెలుగులో (mahabharatham telugulo)

మహాభారతాన్ని మన పంచమ వేదం గ చెప్పుకుంటాం. ఈ మహాభారతాన్ని సంస్కృతంలో రచించినది వేదవ్యాసుడు.వ్యాసునకు వేదవ్యసుడను పేరు రావడానికి గల కారణం ఏమిటంటే పూర్వం వేదములన్ని ఒకటిగా ఉండేవి.వాటిని వ్యాసుడు ఋగ్వేదం,యజుర్వేదం,సామవేదం మరియు అధర్వణ వేదాలుగ విభజించాడు.తరువాత తన శిష్యులైన పైలుడు,వైశంపాయనుడు,సుమంతుడు,జైనుడు లచే ఈ వేదములకు సూత్రములు రాయించాడు.ఈ కారణం చేతనే వ్యాసుడు వేదవ్యాసుడు గ ప్రసిద్ధి చెందాడు.
  వ్యాసమహాభారతం లో మొత్తం 100 పర్వములు ఉన్నాయి. అవి
1 పౌష్యము. 2.పౌలోమము. 3.ఆస్తీకము. 4.ఆదివంశావతరము.
5.సంభవపర్వము 6.జతుగృహదాహము. 7.హైండింభము 8.బకవధ
9.చైత్రరధము. 10.ద్రౌపదీస్వయంవరం 11.వైవాహికము 12.విదురాగమనము
13.రాజ్యార్ధలాభము 14.అర్జున తీర్థయాత్ర 15.సుభద్రాకల్యాణం 16.హరణ హారిక
17.ఖాండవధహనము. 18.మయదర్శనము 19.సభాపర్వము 20.మంత్రపర్వము
21.జరసంధవధ 22.దిగ్విజయము 23రాజసూయము. 24.బర్ఘ్యాభిహరణము
25.శిశుపాలవధ 26.ధ్యూతము 27.అనుధ్యూతము 28.అరణ్యము
29.కిమ్మీరవధ 30.కైరాతం. 31.ఇంద్రలోకాభిగమనము 32.ధర్మజతీర్ధయాత్ర
33.జటాసురవధ 34.యక్షయుద్ధం 35.అజగరము 36.మార్కాoడేయోపఖ్యానము
37.సత్యాద్రౌపదిసంవాధము. 38.ఘోషయాత్ర 39.ప్రాయోపవేశము 40వ్రిహిద్రోణకాక్యానము
41.ద్రౌపదీహరణము 42.కుండలాహరణము 43.అరణేయము 44.వైరాటము
45.కీచకవధ 46.గోగ్రహణము 47.అభిమన్యువివాహము 48.ఉద్యోగము
49.సంజయయానము 50.ద్రుతరాష్ట్రప్రజాగారణము. 51.సానత్సుజాతము 52.యానసంధి
53.భగవధ్యానం 54.సేనానిర్యాత 55.ఉలూకధూతాభిగమనము 56.సమారథ,అతిరథ సంఖ్యానము
57.కర్ణ భీష్మ వివాదము 58.అంబోపాఖ్యానము 59.జంబుఖ౦డవినిర్మానము 60.భూమిపర్వము
61.భీష్మాభిషేకము 62.భగవద్గీత 63.భీష్మవధ 64.ద్రోణాభిషేకము
65.సంశప్తక వధ 66.అభిమన్యు వధ 67.ప్రతిజ్ఞాపర్వము 68.జయద్రద వధ
69.ఘటోత్కచ వధ 70.ద్రోణ వధ 71.నారాయణాస్త్ర్హప్రయోగము 72.కర్ణపర్వము
73.శల్యపర్వము 74.హ్రదప్రవేశము 75.గదాయుద్ధము 76.సారస్వతము
77.సౌప్తికపర్వము 78.వైషీఖము 79.జలప్రధానము 80.స్త్రీపర్వము
81.శ్రాద్ధపర్వము 82.రాజ్యాభిషేకము 83.చార్వాకనిగ్రహము 84.గృహప్రవిభాగము
85.శాంతిపర్వము 86.రాజధార్మానుకర్తనము 87.ఆపద్ధర్మము 88.మోక్షధర్మము
89.అనుశాసనికం 90.భీష్మస్వర్గారోహణం 91.ఆశ్వమేధికము 92.అనుగీత
93.ఆశ్రమవాసము 94.పుత్రసందర్శనము 95.నారదాగమనము 96.మౌసలము
97.మహాప్రస్ధానికము 98.స్వర్గారోహణం 99.హరివంశము 100.భవిష్యత్పర్వము
                              
                                      వ్యాసమహర్షి మహాభారతాన్ని 3 సంవత్సరములు రచించాడు.ఈ మహాభారతమును స్వర్గంలో చెప్పడానికి నారద మహామునుని, పితృ లోకంలో చెప్పడానికి దేవలుడుని, గరుడ గంధర్వ యక్షరాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైన శుకమహర్షిని, సర్ప లోకములో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించారు వ్యాసమహర్షి.
                                       

                                  వ్యాసమహభారతాన్నితెలుగులోకి నన్నయ్య బట్టారకుడు అనువదించాడు.నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి అనువదించుటకు గల కారణం ఏమనగా, ఒకరోజు  రాజరాజనరేంద్రుడు తన ఆస్థాన కవి అయిన నన్నయతో , నేను ఎన్నో పురాణాలు విన్నాను. అర్ధశాస్త్రముల గురించి తెలుసుకున్నాను. నాటకములు చూసాను. ఎన్ని విన్నమహాభారతము విన్న దానితో సాటిరాదు. కానీ మహాభారతము సంస్కృతములో ఉన్నది. దానిని దయచేసి మీరు తెలుగులోనికి రాయండి, అని పలికాడు.
                                  దానికి నన్నయ్య "మహారాజ! మహాభారతాన్ని తెలుగులోకి రాయడమంటే ఇసుకలో రేణువులు లేక్కబెట్టుటవంటిది నా వాల్ల అవుతుందా ? అయిన మీరు అజ్ఞాపించారు కావున తప్పకుండ ప్రయత్నిస్తాను". అని పలికి మహాభారత తెలుగు అనువాదానికి శ్రీకారం చుట్టాడు. అ విధంగా మనము మహాభారతాన్నిసులభంగా తెలుసుకోవడానికి మార్గం ఏర్పడినిది.
                                 మహాభారతములోని 100 పర్వములను తెలుగులో 18 పర్వములకు కుదించారు. అనగా వ్యాస మహాభారతములోని మొదటి పర్వమైన పౌష్యము నుండి పద్దెనిమిదవ పర్వమైన మయదర్శనము వరకు ఆదిపర్వముగాను, పందొమ్మిదవ పర్వము సభాపర్వము నుండి ఇరవైఏడవ పర్వము అనుధ్యూతము వరకు తెలుగులో సభా పర్వముగాను, ఇరవైఎనిమిదవ పర్వము అరణ్యము నుండి నలభైమూడవ పర్వము అరణేయము వరకు తెలుగులో అరణ్యపర్వము గాను, నలభై నాలుగవ పర్వము వైరాటము నుండి నలభై ఏడవ పర్వము అభిమన్యు వివాహము వరకు విరాట పర్వము గాను, నలభై ఎనిమిదవ పర్వము ఉద్యోగము నుండి అరవైయవ పర్వము భూమి పర్వము వరకు ఉద్యోగ పర్వముగాను, అరవై ఒకటవ పర్వము భీష్మాభిషేకము నుండి అరవై మూడవ పర్వము భీష్మవధ వరకు భీష్మ పర్వము గాను, అరవై నాలుగవ పర్వము ద్రోణాభిషేకము నుండి డబ్బై ఒకటవ పర్వము నారాయణాస్త్ర్రప్రయోగము వరకు ద్రోణ పర్వము గాను, డబ్బై రెండవ పర్వము కర్ణపర్వము యధాతధంగా కర్ణపర్వముగాను, డబ్బై మూడవ పర్వము శల్క్య పర్వము నుండి డబ్బై ఆరు సారస్వతము వరకు శల్క్యపర్వము గాను, డబ్భై ఏడవ పర్వము సౌప్తికపర్వము నుండి డబ్భై తొమ్మిదవ పర్వము జలప్రధానము వరకు తెలుగులో సౌప్తికపర్వముగాను, ఎనభైయవ పర్వము స్త్రీ పర్వము నుండి ఎనభై నాలుగవ పర్వము గృహప్రవిభాగము వరకు స్త్రీ పర్వము గాను, ఎనభై అయిదవ పర్వము శాంతి పర్వము నుండి ఎనభై ఎనిమిది మోక్షధర్మము వరకు శాంతి పర్వము గాను, తరువాతి రెండు పర్వాలను అనుశాసనిక పర్వముగాను, తరువాతి రెండు పర్వాలను  అశ్వమేధ పర్వముగాను, తరువాతి మూడు పర్వములను ఆశ్రమవాస పర్వము గాను, చివరి ఒక్కొక్క పర్వమును మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వములుగా విభజించి కుదించి రచించడం జరిగింది.

Comments

Post a Comment